4 లైన్స్ గా రాజమండ్రి,సామర్లకోట రోడ్ల విస్తరణ : మంత్రి ధర్మాన

  • Publish Date - November 6, 2019 / 09:47 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని రహదారుల పరిస్థితులపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజమండ్రి, సామర్లకోట రోడ్డులను పీపీపీ పద్ధతిలో 4 లైన్ల రోడ్డులుగా విస్తరిస్తామని తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు శిథిలమైపోయాయనీ వాటిని తిరిగి నిర్మిస్తామన్నారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. దీని కోసం రూ.135 కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు. ప్రాధాన్యత క్రమంగా అన్ని రోడ్లను పరిశీలించి మరమ్మత్తులు చేపడతామని మంత్రి అన్నారు.