కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్‌తో చర్చించారు. రాజంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించడంతో.. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు మేడా మల్లికార్జున్‌రెడ్డి. జగన్ తో భేటీ అనంతరం మేడా మాట్లాడుతూ..బాబు గంజాయి వనం నుంచి బయటపడ్డానని తెలిపారు.
మేడాను ఈ రోజు(జనవరి 22, 2019) ఉదయం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారికి టీడీపీలో స్థానం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు పదవులు అనుభవించి ఎన్నికలు సమీపించగానే వెళ్లిపోయారని, టీడీపీలో ఉండటానికి మేడా అనర్హుడని చంద్రబాబు అన్నారు.