Actor Rajinikanth: చంద్రబాబును కలిసేందుకు రజనీకాంత్ రాజమండ్రి జైలుకు వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తలైవా

రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీకాంత్ వస్తున్నారని ప్రచారం జరగడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తమిళ మీడియా వర్గాల్లోనూ

Rajinikanth and Chandrababu

Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) ను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) లో ఉన్నారు. అయితే, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు విధానం సరికాదంటూ పలువురు ప్రముఖులు పేర్కొంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్ తో పాటు విదేశాల్లోని పలు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులుసైతం రోడ్లపైకొచ్చి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Chandrababu Arrest : ఏపీలో ఇకపై ఎవరూ పైసా కూడా పెట్టుబడి పెట్టరు, చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది-యనమల రామకృష్ణుడు

చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం తెలుసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్ చేసి పరామర్శించిన విషయం తెలిసిందే. నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాటయోధుడు, చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష. ధైర్యంగా ఉండాలని, త్వరలో‌నే నా మిత్రుడు బయటకు వస్తారని రజనీకాంత్ అన్నారు. అయితే, సోమవారం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీకాంత్ వస్తారని ప్రచారం జరిగింది.

CM Jagan Comments on Chandrababu : స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం‎లో సూత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్ కామెంట్స్

రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీకాంత్ వస్తున్నారని ప్రచారం జరగడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం తమిళ మీడియా వర్గాల్లోనూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై రజనీకాంత్ స్పందించారు. ఆదివారం తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు రజనీకాంత్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎప్పుడు వెళ్తున్నారని మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. చంద్రబాబును కలిసేందుకు వెళ్లాలని అనుకున్నానని, అయితే, ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని రజనీ కాంత్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. తాజాగా రజనీకాంత్ వ్యాఖ్యలతో చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు ఆయన సోమవారం రావడంలేదని క్లారిటీ వచ్చినట్లయింది.

 

ట్రెండింగ్ వార్తలు