హైపవర్ మీటింగ్ : రాజధాని రైతులకు మేలు చేస్తాం – బోత్స

  • Publish Date - January 17, 2020 / 08:02 AM IST

రాజధాని రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బోత్స ప్రకటించారు. రైతులకు మేలు జరిగేలా కార్యక్రమాలను చేయాలని సీఎం జగన్ సూచించడం జరిగిందని తెలిపారు. రాజధాని రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈమెయిల్ టెక్నికల్ సమస్యలు ఏర్పడలేదని వెల్లడించారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం సీఎం జగన్‌తో హై పవర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.

కీలక అంశాలపై చర్చించారు. 2020, అవసరమైతే..హై పవర్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని, లేనిపక్షంలో తుది నివేదికను ప్రభుత్వానికి అందచేయడం జరుగుతుందన్నారు. మీటింగ్ ముగిసిన అనంతరం మంత్రి బోత్స మీడియాతో మాట్లాడుతూ…టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలో పడవద్దని సూచించారు. 

CRDA చట్టం రద్దు అంశం చర్చకు రాలేదన్నారు. అమరావతి అంశంపై నియమించబడిన కమిటీల నివేదికలను హై పవర్ కమిటీ పరిశీలించిందన్నారు. ప్రాంతాల్లో ఉన్న అసమానతలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రణాళికబద్ధంగా ముందుకెళుతామని, మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.

అమరావతిలో ఉన్న నిర్మాణాలను ఉపయోగించుకుంటామని, అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. రాజధాని విషయంలో జనసేన, బీజేపీ పార్టీలకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా ? ఉనికిని కాపాడుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నవి పట్టించుకోమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేయడం జరుగుతుందన్నారు. 

Read More : సెల్యూట్ జవాన్ : మంచువర్షంలో వృద్ధుడిని కాపాడారు

ట్రెండింగ్ వార్తలు