Instagram Reels: ప్రాణాల మీదకు తెచ్చిన రీల్స్.. వీడియో తీస్తుండగా రైలు ఢీకొని యువకుడికి గాయాలు

రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి, రైలు పట్టాల వద్ద రైలు వస్తుండగా ఒక వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Instagram Reels: రీల్స్ మీద మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలా మంది. రిస్కీ ప్రదేశాల్లో వీడియోలు తీసి, శభాష్ అనిపించుకోవాలని, లైక్స్, కామెంట్స్ కోసం ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Singer Vaishali Bursala: సింగర్ వైశాలి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చంపించింది స్నేహితురాలే.. ఎందుకో తెలుసా?

ఇప్పటికే రీల్స్ వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే యువకుడు రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అజయ్.. రైలు పట్టాల వద్ద ఒక వీడియో షూట్ చేయాలనుకున్నాడు. కాజీపేట సమీపంలోని వడ్డేపల్లి ట్రాక్‌పై వీడియో తీస్తున్నాడు. రైలు వెనుక నుంచి వస్తుండగా, పక్కనే నడుస్తూ రావాలనుకున్నాడు. కానీ, వెనుక నుంచి వచ్చిన రైలు అతడ్ని వేగంగా ఢీకొట్టింది. రైలుకు, తనకు మధ్య ఉన్న దూరం వల్ల ప్రమాదం జరగదనుకున్నాడు. కానీ, రైలుకు దగ్గరగా ఉండటంతో అది ఢీకొంది.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

ఈ ఘటనలో అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వీడియో చిత్రీకరిస్తున్న అతడి స్నేహితులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజయ్ ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.