Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

Rahul Gandhi on India's economy

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానమని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల పెరుగుదల, జీఎస్టీ, నిరుద్యోగాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది.

Rahul Gandhi: నేటి ఈ దుర్భర పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహిస్తారు.. మోదీపై రాహుల్ విమర్శలు

ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. ‘‘దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముక్కలు చేస్తున్నాయి. బీజేపీతో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరుగుతోంది. ఆ ఇద్దరు టైకూన్లు టీవీలు, పత్రికల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఆ ఇద్దరి కోసమే కేంద్రం పనిచేస్తోంది. ఆ ఇద్దరి మద్దతు లేకపోతే మోదీ ప్రధాని కాలేకపోయేవారు. పేదలు, రైతులు.. మోదీ విధానాలతో విసిగిపోయారు. పేదల వెన్నెముకను మోదీ విరిచేశారు. రాజ్యాంగం చెప్పినట్లు ఈ దేశం నడుచుకోవాలి. ఇద్దరు టైకూన్లు చెప్పినట్లు కాదు. దేశాన్ని ముక్కలు చేయడమే మోదీ విధానం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోదీ అవహేళన చేశారు. విపక్షాలన్నీ కలిపి మోదీని గద్దె దించాలి. దేశంలో విద్వేషం పెరుగుతోంది.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

దేశ ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోంది. జనం బేబులను మోదీ లూఠీ చేస్తున్నారు. దేశంలో పేదరికం మరింత పెరగబోతోంది. ఈ దేశం అందరిదీ. ఇది మా విధానం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపైకి ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోంది కేంద్రం. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వారిని పట్టించుకునే వారే లేరు. ప్రజలకు భరోసా కల్పించే కార్యక్రమాలు కరువయ్యాయి. ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే వారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.