Rahul Gandhi: నేటి ఈ దుర్భర పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహిస్తారు.. మోదీపై రాహుల్ విమర్శలు

ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేముందు కూడా పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనంటూ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi: నేటి ఈ దుర్భర పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహిస్తారు.. మోదీపై రాహుల్ విమర్శలు

Rahual Gandi

Rahul Gandhi: ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేముందు కూడా పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ అనే నినాదంతో ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. అయితే ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. మధ్యాహ్న జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Congress protest rally: ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ తలపెట్టిన నిరసన ర్యాలీకి భారీగా తరలివస్తోన్న నేతలు, కార్యకర్తలు

ర్యాలీలో పాల్గొనే ముందు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజు స్నేహితుల సంపాదనలో బిజీగా ఉన్నాడు.. ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధపడుతున్నారంటూ మోదీ పాలన తీరుపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ప్రజలు తమకు కావాల్సినవి కనుక్కోవడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని, ఈ సమస్యలకు ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహించాలని అన్నారు. మేము ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గొంతులను జోడిస్తామని, రాజు వినాల్సి ఉంటుందని రాహుల్ అన్నారు.

సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించనున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500కి.మీ మేర సాగే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’  ర్యాలీ నాంది. రాహుల్ గాంధీ ఆగస్టు చివరి వారం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి ఇటలీలో ఉన్నారు. సోనియాగాంధీ తల్లి ఆగస్టు 27న కన్నుమూశారు.