జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోనే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఆర్కే బీచ్ లో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోనే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఆర్కే బీచ్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్, సీఎం జగన్, మంత్రులు, అధికారులు పాల్గొంటారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న మొదటి గణతంత్ర వేడుక కావడంతో.. దీన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని సీఎం జగన్ ప్రతిపాదన చేశారు. ఈ తరుణంలో ఈ వేడుకకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజధానిగా విశాఖను మార్చడానికి జగన్ అనుకూలంగా ఉన్నారని సూచించడానికి… ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని నిర్ణయించడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇక రాజధాని అంశంపై ఏర్పాటైన జీఎన్ రావ్, బోస్టన్ కమిటీలు కూడా.. రాజధాని విభజనకే మొగ్గు చూపాయి. పరిపాలన రాజధానిగా విశాఖ బెస్ట్ అని తేల్చాయి. ఈ కమిటీల ప్రతిపాదనలను హై పవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది. త్వరలో నివేదికను సీఎం జగన్ కి సమర్పించనుంది.
జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హై పవర్ కమిటీపై చర్చించి రాజధానిపై సీఎం జగన్ అంతింగా ఓ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మూడు రాజధానుల నిర్ణయంపై ఓవైపు అమరావతి ప్రాంతంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం మాత్రం విశాఖకు రాజధాని కార్యకలాపాలు మార్చేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే రాజధాని ప్రాంతంలో ఆందోళనలు తీవ్రం కావడంతో విశాఖలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ సీఎం అయ్యాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి గణతంత్ర దినోత్సవం ఇదే.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తుండేవారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు చంద్రబాబు. 2018లో మాత్రం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు హాజరయ్యారు. విశాఖను పరిపాలన రాజధానిగా జనవరి 20వ తేదీ నుంచి ఉపయోగించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి.
Also Read : రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబు సంచలన స్టేట్ మెంట్