ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది.

  • Publish Date - March 8, 2020 / 03:52 PM IST

ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది.

ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్ ఒక స్థానం, ఎస్సీ జనరల్ 7 స్థానాలు, ఎస్సీ మహిళలకు 7 స్థానాలు, బీసీ జనరల్ 17 స్థానాలు, బీసీ మహిళలకు 17 స్థానాలు, జనరల్ మహిళలకు 26 స్థానాలు, జనరల్ 26 స్థానాలు కేటాయించారు. 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పురపాలక, నగర పంచాయతీ స్థానాలకు, రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు కేటాయిస్తూ పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ విడుదల చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో 2123 వార్డులకు ఖరారు కాగా.. తాజాగా 103 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం అందజేయనుంది. ప్రభుత్వం రిజర్వేషన్ల వివరాలు అందించనున్న నేపథ్యంలో సోమవారం పుర, నగర పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.

రాష్ట్రంలో 110 పురపాలక సంఘాలు ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. దీంతో 103 పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన గెజిట్ విడుదల చేశారు.