మీకు బియ్యం కార్డు ఉందా..అయితే ఇన్ కం సర్టిఫికేట్ అవసరం లేదు

  • Publish Date - July 26, 2020 / 07:12 AM IST

ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.

బియ్యం రేషన్ కార్డు కలిగిన వారికి ప్రత్యేకంగా ఆదాయ సర్టిఫికేట్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 2020, జులై 25వ తేదీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. Rice Card ఆదాయానికి కొలమని వెల్లడించింది.

ఇక కార్డు లేని వారు ఆందోళన చెందవద్దని, వారి వద్దనున్న ఇన్ కమ్ సర్టిఫికేట్ కాల పరిమితి నాలుగేళ్ల పాటు ఉంటుందని స్పష్టం చేసింది.

2020, జులై 25వ తేదీ శనివారం ఉదయం రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సచివాలయంలోని ఐదో బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రెండు కీలక నిర్ణయాల ఫైల్ పై సంతకం చేశారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి 2017 జూన్ 23 నాటి ఉత్తర్వులను మారుస్తూ..జీవో ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ…సీఎం జగన్ తనకు కీలక బాధ్యతలు అప్పచెప్పారని, ఆయన ఆశయాల సాధన కోసం తాను పని చేస్తానని స్పష్టం చేశారు. బియ్యం కార్డు ఆదాయ సర్టిఫికేట్ గా గుర్తించడం, కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు పొడిగించడం వల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నరు.

ట్రెండింగ్ వార్తలు