Godavari Floods
Godavari Floods at Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంటగంటకు పెరుగుతుంది. గోదావరి నీటిమట్టం 44.20 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి నుంచి 9.46లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరువలో ఉంది. 48అడుగులను దాటగానే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.
Also Read : రుణమాఫీ కానందునే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడా? అసలేం జరిగింది…
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా ఇవాళ సాయంత్రం వరకు గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో 24 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు.