×
Ad

Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖ మధురవాడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

  • Published On : December 9, 2021 / 08:31 AM IST

Road Accident

Visakha Road Accident: విశాఖ మధురవాడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంను లారీ ఢీకొట్టగా.. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండగా.. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Farmers’ Protest: ఢిల్లీ సరిహద్దుల్లో నేటితో ముగియనున్న రైతు ఉద్యమం!

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై కూడా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మేదరమెట్లలో బట్టల షాపును నిర్వహించే వెంకటేశ్వర్లు, అనంతలక్ష్మి దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.