RTC Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఏపీకి వెళ్తుండగా ఘటన..
RTC Bus Accident : జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ వద్ధ ఈ ఘటన చోటు చేసుకుంది.
- Harishth Thanniru
- Updated on- February 19, 2026 / 07:34 AM IST
Road Accident
- గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- తెల్లవారుజామున బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
- హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఘటన
- ఆరుగురికి తీవ్రగాయాలు.. పలువురికి స్వల్ప గాయాలు
- చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
RTC Bus Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలో నేషనల్ హైవే 44పై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
Also Read : Botcha Satyanarayana: ఎమ్మెల్సీ బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు.. అందులో ఏముందంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుంది. గురువారం తెల్లవారుజామున 4గంటల సయమంలో ఇంటికాలపాడు స్టేజీ సమీపంలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 108 ద్వారా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
