Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్యూటీలోఉన్న ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి

కడప శివారు ప్రాంతమైన ఇస్కాన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యూటీలోఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ మృతిచెందారు.

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప శివారు ప్రాంతమైన ఇస్కాన్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకున్నాయి. ఘటన తీవ్రతకు పక్కనే ఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కారుపై లారీ పడింది. దీంతో డ్యూటీలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి చెందారు. మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్, కానిస్టేబుల్ మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు