Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు.. తండ్రీ, కొడుకు మృతి..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ, కొడుకు మరణించగా, తల్లీ, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

Road accident

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ, కొడుకు మరణించగా, తల్లీ, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సోమవారం తెల్లవారు జామున నందిగాం మండలం పెద్దనాయుపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Road Accident in Munagala: అయ్యప్ప పడిపూజ ముగించుకొని ట్రాక్టర్‌లో వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి.. పదిమందికి గాయాలు..

ఈ ఘటనలో కారు నడుపుతున్నది పలాస ప్రభుత్వం ఆస్పత్రి సూపరింటెండెంట్ మడే రమేష్ (45)తో పాటు అతడి కుమారు సంకల్ప్ (10) అక్కడికక్కడే మరణించారు. వైద్యాధికారి భార్య ప్రసన్న లక్ష్మీ (45), కుమార్తె సైర్య (14)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యంకోసం శ్రీకాకుళం తరలించారు. వీరు విశాఖపట్టణం నుంచి పలాసకు వస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.