Road Accident in Munagala: అయ్యప్ప పడిపూజ ముగించుకొని ట్రాక్టర్‌లో వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి.. పదిమందికి గాయాలు..

మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై విజయవాడ వెళ్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ లోని ఐదుగురు మృతిచెందగా, 10మందికి గాయాలయ్యాయి.

Road Accident in Munagala: అయ్యప్ప పడిపూజ ముగించుకొని ట్రాక్టర్‌లో వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి.. పదిమందికి గాయాలు..

Road Accident

Road Accident in Munagala: సూర్యాపేట జిల్లా మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం, సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 38మంది ఉన్నారు. శనివారం రాత్రి అయ్యప్ప పడిపూజకువెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి రాంగ్ రూటే కారణమని పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో తొందరగా ఇంటికి వెళ్లానే ఉద్దేశంతో డ్రైవర్ రాంగ్ రూట్ లో ట్రాక్టర్ పోనివ్వటంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన మినీ బస్సు.. 22 మంది మృతి

మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలయానికి కిలో మీటరున్నర దూరంలో యూటర్న్ ఉంది. యూటర్న్ తీసుకొని వెళ్లితే కిలో మీటరున్నర దూరం పెరుగుతుంది. రాంగ్ రూట్‌లో 200 మీటర్లు ప్రయాణిస్తే మునగాల చేరుకుంటామన్న ఉద్దేశంతో ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్‌రూట్‌లో ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు.

Rajasthan Gang Rape : దొంగతనానికి వచ్చి దారుణం.. భర్తను బంధించి అతడి ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు

ఎదురుగా వస్తున్న లారీ రాత్రి సయమంలో రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించేందుకు ప్రయత్నించినా సాధ్యంకాకపోవటంతో ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల (33), ఉదయ్‌ లోకేశ్‌ (8), నారగాని కోటయ్య (55) మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోగా.. గండు జ్యోతి(38) చికిత్స పొందుతూ మరణించింది. మరో పది మందికి గాయాలు కావటంతో వారికి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో పోనిచ్చి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.