Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన మినీ బస్సు.. 22 మంది మృతి

మినీ వ్యాను నీటిపారుదల కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22మంది మృతి మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మినీబస్సు ప్రమాదానికి డ్రైవర్ డ్రగ్స్ మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడమే కారణమని పోలీసులు నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన మినీ బస్సు.. 22 మంది మృతి

Road Accdient

Road Accident: ఈజిప్ట్‌లోని ఉత్తర డకాలియా ప్రావిన్స్ పరిధిలోని ఆగ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న మినీ వ్యాను నీటిపారుదల కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22మంది మృతి మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మినీబస్సు ప్రమాదానికి డ్రైవర్ డ్రగ్స్ మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడమే కారణమని పోలీసులు నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Road Accdient: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు

గాయాలతో చికిత్స పొందుతున్న పలువురు డ్రైవర్ మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వ్యాన్ నడిపాడని తెలిపారు. మరొక వాహనం ముందునుంచి అతి వేగంతో వచ్చి మినీబస్సును ఢీకొట్టింది. దీంతో అగా పట్టణంలోని అల్ రయా అల్ తౌఫికి కాలువలోకి మినీ వ్యాన్ దూసుకెళ్లినట్లు గాయపడిన వారు తెలిపారు. మినీబస్సు కాలువలోకి దూసుకెళ్లేముందు అందులో నుంచి ఒకరిద్దరు బయటకు దూకారు. దీంతో వారికి కాళ్లు, భుజనాకి గాయాలయ్యాయి.

T20 World Cup Final: నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. తలపడనున్న పాక్ వర్సెస్ ఇంగ్లాండ్.. నిబంధనలు మార్చిన ఐసీసీ

ప్రమాద ఘటన జరిగిన వెంటనే 18 అంబులెన్స్‌లు ప్రమాద స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులతో సహా 46 మంది ప్రయాణీకులు ఉన్నారు. మృతుల్లో ఆరుగు మహిళలు కాగా, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు లక్ష ఈజిప్ట్ ఫౌండ్లను, క్షతగాత్రులకు 25వేల పౌండ్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.