Road Accident
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సింగ్ పవార్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), కుసాల్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)గా గుర్తించారు.
Also Read : Road Accident : ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం.. రెండు లారీలు, ట్రావెల్స్ బస్సు ఢీ..
ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.