Visakhapatnam: విశాఖపట్టణంలో రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో దాడి ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి పది మందికిపైగా రౌడీమూక గాజువాకలోని బీసీ రోడ్డులో హల్ చల్ చేసింది.
రౌడీ మూక ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తన కారుకి రాళ్లు తగులుతున్నాయని స్థానిక వ్యక్తి జీవన్ ప్రశ్నించగా.. అతనిపై కొందరు బీర్ బాటిల్స్‌తో దాడి చేశారు. దీంతో అతనికి గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.