CM Jagan : ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు, సీఎం జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికారులను

Cm Jagan

CM Jagan : రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారికి 25ఏళ్లు వచ్చే వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ ఉండనుంది. ఈ 10లక్షలపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నారు. ఈ పిల్లలంతా వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని అధికారులకు జగన్ గుర్తుచేశారు.

కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం కర్ఫ్యూ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులే అయింద‌న్న సీఎం.. క‌ర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. కొవిడ్‌తో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. వారికి ఆర్థిక‌సాయం అంద‌జేయడంపై కార్యాచరణ‌కు అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు.

కొవిడ్ బాధితుల్లో కొంద‌రిని వేధిస్తున్న‌ బ్లాక్‌ఫంగ‌స్ చికిత్స‌ను కూడా ఆరోగ్య‌శ్రీ‌లోకి తీసుకురావాల‌ని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే బ్లాక్ ఫంగ‌స్ నివార‌ణ మందులు స‌మ‌కూర్చాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 9 బ్లాక్ ఫంగ‌స్ కేసులు గుర్తించారు. 10 వేల ఆక్సిజ‌న్ కాన్స్‌న్‌ట్రేట‌ర్ల‌కు టెండ‌ర్లు పిలిచారు. ఈ నెలాఖ‌రుకు 2 వేల‌కు పైగా ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఫీవ‌ర్ స‌ర్వేలో భాగంగా క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారిని గుర్తించి.. ల‌క్ష‌ణాల తీవ్ర‌త‌ను బ‌ట్టి చికిత్స అందించనున్నారు.