Heavy Cash Seized : చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుబడిన నగదు..కారులో తరలిస్తున్న రూ.90 లక్షలు సీజ్

చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. గంగవరం పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది.

Rs 90 Lakh Seized In Chittoor District

Heavy cash seized : చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. గంగవరం పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ స్విఫ్ట్ కారులో రూ.90 లక్షల నగదు పట్టుబడింది.

కారులో వెళ్తున్న శుభాంకర్, సంజు సాహు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. డబ్బు ఎక్కడి నుంచి ప్రశ్నించగా వాళ్లు నీళ్లు నమిలారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా అసలు నిజం బయటపడింది.

బెంగళూరులోని ఓ ఇంట్లో చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. చోరీ చేసిన నగదుతో పశ్చిమ బెంగాల్ కు పారిపోతున్నట్లు తెలిపారు. దీంతో గంగవరం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.