AP CM Jagan : సెప్టెంబర్‌ నుండి విశాఖ నుంచే పాలన.. నేను కూడా అక్కడే ఉంటా : సీఎం జగన్‌

ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన అన్నారు.

AP CM Jagan : రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని తెలిపారు. ఈ సెప్టెంబర్‌ నుంచి తాను విశాఖలోనే ఉంటానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే కాపురం ఉంటానని తెలిపారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన అన్నారు.

‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు.. మిగతా వాళ్లంతా ఏకమవుతున్నారు.. అంతా ఏకమై నాతో చీకటి యుద్ధం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెత్తందార్లు.. పేదల పక్షాన నిలబడిన తనకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారని వెల్లడించారు. వారిలా అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తన ధైర్యం, నమ్మకం మీరేనని ప్రజలు ఉద్ధేశించి జగన్ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో తన ఆత్మవిశ్వాసం ప్రజలే అని అన్నారు.

CM Jagan : అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం… మరో 265 గ్రామాలకు వంశధార తాగునీరు : సీఎం జగన్

దేవుని దయ.. ప్రజల చల్లని ఆశీస్సులు కోరుకున్నానని తెలిపారు. తోడేళ్లన్నీ ఏకమైనా.. తనకేమీ భయం లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. మే3న బొగాపురం ఎయిర్ పోర్టు, ఆ తర్వాత డేటా సెంటర్ కు శంఖుస్థాపన చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ నుండి ఎయిర్ పోర్ట్ కు 6 లైన్స్ హైవే నిర్నించనున్నామని పేర్కొన్నారు. పరిపాలనా రాజధానిలో భాగంగా సెప్టెంబర్ నుండి విశాఖలో కాపురం కూడా పెడతామని స్పష్టం చేశారు. డీబీటీ బటన్ నోక్కడమే కాదు… ప్రాంతాల చరిత్ర కూడా మార్చడానికి తాను అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

మంచి చేస్తున్నాం కాబట్టి… మంచి చేయలేని వారంతా ఏకం అవుతున్నారని.. తాను ఓక్కరే ఓ వైపు ఉన్నారని తెలిపారు. కొందరు చీకటి యుద్ధం చేస్తున్నారని.. అబద్ధాన్ని నిజమని చెప్పే యుద్ధం చేస్తున్నారని చెప్పారు. పెత్తందారుల టీడీపీకి – పేదలు తరుపున తనకు యుద్ధం జరుగుతుందన్నారు. ‘మీ ఇంట్లో మంచి జరిగితే.. మీ బిడ్డకు సైనికుడిగా మీరే కదలండి.. మీ బిడ్డకు దత్తపుత్రుడు లేడు అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రజల చల్లని ఆశీస్సులపై తనకు నమ్ముకం ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు