S. Vishnuvardhan Reddy
S. Vishnuvardhan Reddy Comments YCP Leaders : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీ అప్పులపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి, టీటీడీ ఛైర్మన్ సహా రాష్ట్ర మంత్రులు వరుస గట్టి మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ నాయకులు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాము అడిగిన ప్రశ్నలకు 24 గంటల్లో శ్వేతాపత్రం విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి గొప్పగా ప్రకటించారని చెప్పారు.
కానీ, మూడు రోజులైనా ఎందుకు స్పందించ లేదో ప్రగల్భాలు పలికినవారు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే అన్ని చేసేస్తామని జగన్ హామీలతో మోసగించారని విమర్శించారు. తాము అడిగే తొమ్మిది ప్రశ్నలకు 9 మంది వైసీపీ నాయకులు సమాధానం చెప్తారా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి, క్యాబినెట్ మొత్తం చర్చకు వచ్చినా సిద్ధమని సవాల్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అద్వాన పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. తాను ఇప్పుడు చెప్పే 9 అంశాలపై వైసీపీ నాయకులు మంత్రులు స్పందించాలన్నారు.
Kolleru Lake : ఉధృతంగా ప్రవహిస్తున్న కొల్లేరు.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం
ఆంధ్రప్రదేశ్ బాలల అక్రమ రవాణాలో మూడో స్థానం, మహిళల అక్రమ రవాణాలో ముందు వరసలో ఉందనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కన్నా ఏపీ ఎందుకు వెనకబడి ఉందన్నారు. పేదలను మరింత పేదలుగా మార్చేలా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఉందనేది నిజం కాదా అని నిలదీశారు. ప్రతి మనిషికి కనీస అవసరాలైన నీరు, ఇల్లు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.
30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం.. ఆ పేదల పేరు చెప్పి నాయకులు దోచుకుంది వాస్తవం కాదా అని నిలదీశారు. మోదీ తరహాలో ఇళ్లు ఇస్తే కమీషన్లు రావని వైసీపీ ప్రభుత్వం స్థలాల పేరుతో దోచుకుందని ఆరోపించారు. ఉన్నత విద్య విషయంలో ప్రభుత్వ విధానాలు లోపం భూయిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజలతో చీ కొట్టించుకున్న ఒక దర్శకుడిని తెచ్చి అర్ధ నగ్న భంగిమలు ఎలా ఉన్నాయో విద్యార్థులతో చెప్పించడం సిగ్గుచేటు అని అన్నారు. పేద మహిళ పుస్తెలను తెంచి, వారి జీవితాలను వీధిలోకి తెచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా రవాణా అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో మంచి వైద్యం అందట్లేదు కాబట్టి మంత్రులు కూడా ఏయిర్ అంబులెన్సు ద్వారా హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ కు విజిటింగ్ మంత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి అడిగిన వాటికి సమాధానం చెప్పలేని చేతకాని అసమర్ధులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు. సిగ్గులేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలా బీజీపీ వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్ళదన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పుకున్న విధంగా అన్నీ సక్రమంగా చేస్తే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
వైసీపీ బూతులకు సరైన సమాధానం ఇవ్వాలంటే తమ బూత్ స్థాయి నాయకులు చాలు అని పేర్కొన్నారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకుని దమ్ముంటే తాము అడిగిన వాటిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. లేదా నాలుగేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశామని అంగీకరించి తప్పును సరిచేసుకోవాలని తెలిపారు.