CI Nagaraju Arrest : సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ నాగరాజు అరెస్ట్

CI Nagaraju Arrest : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ అయ్యాడు.

Saikrishna missing case Updates CI Nagaraju arrested

CI Nagaraju Arrest : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్‌ అయిన కృష్ణలంక మాజీ సీఐ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును(CI Nagaraju)సిట్ అధికారులు విజయవాడలోని సింగ్‌నగర్‌లో అరెస్ట్‌ చేశారు.

Also Read : Gold Mining Project In Kurnool : ఏపీలోనూ ఓ కేజీఎఫ్..! కర్నూలు జిల్లాలో ‘గోల్డ్‌మైన్‌’ రెడీ.. రేపటి నుంచి అసలు కథ మొదలు..

ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారుల బృందం మంగళవారం ఉదయం సీఐ నాగరాజు ఇంటికి వెళ్లింది. సిట్ బృందం రావడంతో నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి నాగరాజును అరెస్టు చేసి విచారణ నిమిత్తం పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అయితే, అరెస్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సీఐ నాగరాజుపై ఇప్పటికే అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.