Kuppam : ప్రజలు బాబుకు దండం పెట్టేశారు : సజ్జల
కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు
- kunduru Vinod
- Published On : November 17, 2021 / 06:06 PM IST
Kuppam (3)
Kuppam : కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు. వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ పట్టం కడుతున్నారని తెలిపారు.
చంద్రబాబు : Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సొంతూరిలో కూడా మా ప్రభుత్వమే బాగుచేసింది -సజ్జల రామకృష్ణా రెడ్డి
పలు ఎన్నికల్లో టీడీపీకి జనసేన బహిరంగంగానే మద్దుతు ఇచ్చిందన్నారు. 100 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 97 శాతం స్థానాల్లో విజయం సాధించామని సజ్జల పేర్కొన్నారు. 2019లో 50శాతం ఓట్లతో ప్రారంభమైన యాత్ర ఇప్పుడు 90 శాతాన్ని మించిందన్నారు సజ్జల. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని పండగ చేసుకుంటున్నారని, కళ్లు మూసుకుని తమదే విజయం అంటుంటే జాలి పడాల్సిందేనని అన్నారు. కుప్పంలో తమ పార్టీని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు : Sajjala : ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారు
