Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారు. నాలుగు ఓట్లకోసం అబధ్ధపు హామీలు ఇస్తున్నారని సజ్జల విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థ పై నమ్మకం ఉంటే.. ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఎంటి? వాలంటరీల వ్యవస్థ పై గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ తీసేస్తాం అన్నారు.. ఇప్పుడు ఆ వ్యవస్థ కొనసాగిస్తాం అంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వాలంటరీలను తీసేసి జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని సజ్జల విమర్శించారు. పెన్షన్ ఆపివేయించింది చంద్రబాబే.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. పైగా ఆ నెపాన్ని వైసీపీపై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ.. రెబల్ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు
రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రచారంలో ఉంటే అడిగే హక్కు టీడీపీకి ఎక్కడని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. వైసీపీకి ఎక్కువగా ఈసీ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ నుంచి ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి తెలుస్తుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీదే ఘన విజయం అవుతుందని సజ్జల పేర్కొన్నారు. ప్రజాతీర్పు ఇప్పటికే స్పష్టంగా ఉంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Janasena : జనసేనకు మరో షాక్? వైసీపీలోకి ఆ జిల్లా అధ్యక్షుడు?
నాలుగైదు నెలలపాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది. ప్రజలంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది? అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉంది. వాళ్లను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు వచ్చారని వైసీపీ అభ్యర్థుల మార్పు ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.