Sajjala Ramakrishna Reddy : టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ.. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబుతో సమానం : సజ్జల రామకృష్ణారెడ్డి

హెరిటేజ్ పేరుతో ల్యాండ్ తీసుకోవడం వాస్తవం అన్నారు. ఎందుకు అక్కడ తీసుకున్నారనే వివరణ వాళ్ళే ఇవ్వాలని తెలిపారు. పర్సనల్ అవసరాల కోసం అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు.

Sajjala Ramakrishna Reddy (1)

Sajjala Ramakrishna Reddy – Chandrababu : టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఎద్దేవా చేశారు. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబుతో సమానమని అన్నారు. దొంగతనం చేసి అరెస్టు అయితే అక్రమ అరెస్టు అని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు రిమాండ్ లో ఉన్నాడు.. కోర్టులో వాదించుకోవాలని సూచించారు. చంద్రబాబు అరెస్టుతో దేశానికి ఏదో జరిగిపోతుందని బిల్డప్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అమరావతిలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

చంద్రబాబు ప్రజా ఉద్యమం చేసి అరెస్టు కాలేదని, ప్రజా సొమ్ము దోపిడీ చేయడం వల్ల అరెస్టు అయ్యాడని తెలిపారు. చంద్రబాబును అషామాషీగా అరెస్టు చేయలేదన్నారు. మూడేళ్లు విచారణ జరిపి అరెస్టు చేశారని తెలిపారు. ఆధారాలు చూసి కోర్టు నమ్మింది కనుకే రిమాండ్ విధించిందన్నారు. స్కాం పక్కకి నెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దోమలు కొడుతున్నాయి.. టేబుల్ లేదని ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

CM Jagan : వైఎస్సార్ వాహనమిత్ర నిధులు విడుదల.. రూ.275.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం జగన్

దొంగతనం చేసినవాడు సింపతీ కోసం ప్రయత్నం చేయడమేంటని ప్రశ్నించారు. స్కిల్ స్కాం తో పాటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాముల్లో ఆధారాలు పక్కగా ఉన్నాయని తెలిపారు. ఈ స్కాముల్లో చంద్రబాబు, లోకేష్ పాత్ర కీలకంగా ఉందన్నారు. పట్టుబట్టి చేయించినట్లు అధికారులు ఇచ్చిన 164 స్టేట్మెంట్ లో ఉన్నాయని తెలిపారు. కక్ష సాధింపు చేయాలంటే నాలుగున్నరేళ్లు ఎందుకు వదిలేస్తామని చెప్పారు.

ఐదు కోట్ల ప్రజలకి పచ్చ కళ్లద్దాలు పెట్టాలని టీడీపీ చూస్తుందన్నారు. ప్రజలకి వాస్తవాలు తెలుసన్నారు. తప్పు చేయకపోతే లోకేష్ ఢిల్లీ వెళ్లి ఎందుక కూర్చున్నాడని ప్రశ్నించారు. ఇక్కడే ఉండి పార్టీని నడుపుకోవచ్చు కదా అని అన్నారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్కిల్ స్కాంపై చర్చలో పాల్గొనే సత్తా లేక బహిష్కరించి పోయారని ఎద్దేవా చేశారు. అమరావతి ఓ మహా కుంభకోణం అని విమర్శించారు.

High Court : చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ

స్కిల్ స్కాంలో అడ్డంగా బుక్కయ్యారని టీడీపీ నేతలకు కూడా తెలుసు అన్నారు. అమరావతి అనేది మహా కుంభకోణం.. ఇన్నర్ రింగ్ రోడ్డు పిట్ట కుంభకోణం అని పేర్కొన్నారు. స్కాములన్నింటిలో సూత్రదారి చంద్రబాబేనని స్పష్టం చేశారు. రెండెకరాల నుండి 2 శాతానికి రూ.400 కోట్లు వచ్చే సంపాదన ఎలా వచ్చిందో భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని హెరిటేజ్ ను పెంచుకున్నారని ఆరోపించారు.

హెరిటేజ్ పేరుతో ల్యాండ్ తీసుకోవడం వాస్తవం అన్నారు. ఎందుకు అక్కడ తీసుకున్నారనే వివరణ వాళ్ళే ఇవ్వాలని తెలిపారు. పర్సనల్ అవసరాల కోసం అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. అరెస్టు చేయాలంటే ఢిల్లీ వెళ్లి అయినా తీసుకుని వస్తారని తెలిపారు. అరెస్టు అనేది అయన ఇచ్చే వివరణ, కేసులో సహకరించే విధానం బట్టి ఉంటుందన్నారు.

High Court : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశం

అరెస్టు అనేది సీఐడీ ఇండిపెండెంట్ గా తీసుకునే నిర్ణయమని పేర్కొన్నారు. అధానీ లాంటి పారిశ్రామికవేత్త వేస్తే రోడ్డుపై చర్చలు జరుపుతారా..? ఇందులో రహస్య భేటీ ఏముందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగిందన్నారు. గతంలో చిన్న చిన్న వాళ్ళు వచ్చి కలిసినా ప్రచారం చేసేవారని పేర్కొన్నారు. తమకు ప్రచారం కంటే పని చేసుకుంటూ పోవడమే ముఖ్యం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరుగుతుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు