మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్విట్టర్ లో అశోక్ గజపతిరాజుపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గారు చేస్తున్నది నిజానికి సేవ్ అశోక్ క్యాంపెయిన్ అని ఆరోపించారు. ఆయన ఆధ్వర్యంలో మాన్సాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఒక్కో అక్రమం బయటపడుతూ ఉండటంతో ఆయన రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోతున్నారని.. అందుకే ఏం చేయాలో తెలియక ఫక్త్ రాజకీయం చేస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయ అస్థిత్వం కోసమే సేవ్ మాన్సాస్ ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
150 ఏళ్ల చరిత్ర కలిగిన మోతీ మహల్ ను నేల మట్టం చేసినప్పుడు మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన 8 వేల ఎకరాల భూములను ఎకరా రూ.500 లీజ్ కు ఇచ్చినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం చేయాల్సిందని చురకలంటించారు. మార్కెట్ ధరలకు మీరిచ్చిన ధరలకు ఏమైనా సంబంధం ఉందా అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. 13 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించి మాన్సాస్ భూముల ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనప్పుడు ఎందుకు సేవ్ మాన్సాస్ ను ప్రారంభించలేదని సంచయిత నిలదీశారు.
https://10tv.in/mansas-trust-ashok-gajapathi-raju-vs-sanchaita/
2016-2020 మధ్య కాలంలో సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల మాన్సాస్ విద్యా సంస్థలకు 6 కోట్ల రూపాయల నష్ట వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోవడం వల్ల 170 మంది విద్యార్థుల డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయని సంచయిత విమర్శించారు. మాక్సాస్ ట్రస్ట్ లో సరైన ఆడిటింగ్ నిర్వహించకపోగా మ్యాన్యువల్ తప్పుడు ఆడిటింగ్ చేయించిన సమయంలో సేవ్ మాన్సాస్ మొదలు పెడితే అసలు నిజం బయటపడేదని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాన్సాస్ కు రావాల్సిన రూ.30 కోట్ల నిధులను ఎందుకు రాబట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. ఎమ్మార్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని అశోక్ గజపతి రాజు వ్యాప్తిలోకి తెచ్చారని మండిపడ్డారు. మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు అదొక ప్రైవేట్ కాలేజీయని ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని మీరే తీసేశారని ఆరోపించారు. గతంలో కొనసాగిన విధానమే ప్రస్తుతం కొనసాగుతుందని సంచయిత స్పష్టం చేశారు.