By Elections Schedule : తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్…ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు

ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది.

Tirupati and Nagarjuna Sagar by-elections Schedule : ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. 30వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్‌ నిర్వహిస్తారు. మే 2వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది.. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎదుర్కోబోతున్న మూడో ఉప ఎన్నిక నాగార్జున సాగర్‌.. నర్సింహ్మయ్య అకాల మరణంతో సిట్టింగ్‌ స్థానం ఖాళీ అయ్యింది. దుబ్బాక, GHMC ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఇప్పుడు నోటిఫికేషన్‌ రావడంతో ప్రధాన పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తిరుపతిలో సిట్టింగ్‌ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారు.. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.. ఇప్పుడీ స్థానంలో తిరిగి ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.. కరోనా కారణంగా ఇన్నాళ్లు నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియ ఆలస్యం జరిగిందని తెలుస్తోంది.

ఇక అధికార వైసీపీ పార్టీ ఎవరిని నిలబెట్టాలన్న దానిపై ఆలోచనలో ఉంది.. మొదట ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలన్న ఆలోచలు వచ్చినా.. బీజేపీ, టీడీపీ బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా కనిపిస్తుండటంతో పోటీ అనివార్యమైంది.

ట్రెండింగ్ వార్తలు