ఏపీలో స్కూళ్లు : సరి – బేసి విధానం, ఏ రోజు ఏ తరగతులంటే

  • Publish Date - October 21, 2020 / 12:55 PM IST

cm jangan

Schools in AP: Classes in Hard and Even mode : ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్నాయి. నవంబర్ 02వ తేదీ నుంచి పాఠశాలలను పున:ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

సరి, బేసి విధానంలో విద్యార్థులకు తరగతులను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 1,3,5,7,9 తరగతులకు ఒక రోజు, 2,4,6,8,10 తరగతులకు రెండో రోజు క్లాసులు నిర్వహించనున్నారు. 750 మంది కంటే ఎక్కువ ఉన్న పాఠశాలల్లో మూడు రోజులకొకసారి తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.



కరోనా నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌ 2న స్కూళ్లు రీఓపెన్‌ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నవంబరులో మధ్యాహ్నం ఒంటిగంట వరకే బడి నిర్వహిస్తూ.. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.

పాఠశాల వేళలపై పరిస్థితిని బట్టి డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటామంది ప్రభుత్వం. అయితే తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో..అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కళాశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలకు తాళాలు పడ్డాయి.



విద్యార్థులకు అన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల చేస్తోంది కేంద్రం. విద్యాసంస్థలు, కళాశాలలు తెరిచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలిపెట్టింది కేంద్రం. సెప్టెంబర్ నుంచే స్కూళ్లను ప్రారంభించాలని ఏపీ సర్కార్ అనుకుంది. కానీ వైరస్ తగ్గుముఖం పట్టకపోతుండడం..పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.



అక్టోబర్ 15 నుంచి తెరవాలని భావించారు. అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకుంది. నవంబర్ 02వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభించాలని చివరకు నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల ప్రారంభం కంటే ముందే..ప్రకటించిన విధంగా..జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు.