AP Govt: ఆగస్టులో స్కూల్స్ రీఓపెన్‌.. మంత్రి సురేష్ ప్రకటన!

రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆదిమూలపు.. ఆగష్టు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP Govt: రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆదిమూలపు.. ఆగష్టు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తుది తేదీ ఇంకా ప్రకటించని మంత్రి ఆగస్టు నుంచి స్కూల్స్ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

అయితే.. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ రోజూ రావాల్సిన అవసరం లేదన్నారు. ఒకరోజు 50శాతం మంది.. మరొకరోజు మిగిలిన 50శాతం మంది తరగతులకు వచ్చేలా చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. గతంలో కరోనా తొలి దశ అనంతరం కూడా ఇలాగే స్కూల్స్ ఓపెన్ చేయగా.. ఇప్పుడు కూడా అలానే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం స్కూల్స్ ప్రారంభించిన సమయంలో ఒకరోజు కొన్ని తరగతులకు, మరో రోజు మరికొన్ని తరగతులకు క్లాసులు నిర్వహించగా ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కూడా అదే పద్ధతిని అమలుచేస్తామని మంత్రి సురేశ్‌ చెప్పారు. అయితే, కరోనా థర్డ్ వేవ్ రాబోతుందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రణాళికలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు ఉంటాయని మంత్రి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు