AP Schools Reopen : ఆగస్టు 16న స్కూల్స్ పునఃప్రారంభం

ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని చెప్పారు.

Adimulapu Suresh

AP Schools reopen : ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నట్లు, అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ టీచర్లకు ఆగస్టు 16లోగా వ్యాక్సినేషన్ పూర్తి కావాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

విద్యా కానుకలో ఈ ఏడాది విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు అందిస్తామని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు. 15 వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని వెల్లడించారు. అమ్మఒడి వద్దన్న 9 లక్షల మందికి వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్ లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

మొదటి దశ నాడు-నేడును ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈలోపు టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.