కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

AP SEC Nimmagadda wrote a letter to union cabinet secretary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలవిషయంలో కల్పించుకోబోమని, ఎన్నికలు యధావిధిగా జరపాలని సుఫ్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖరాశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలకు చెందిన ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వమని కోరతూ ఆయన లేఖరాశారు.

ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమీషన్, ఎన్నికల నిర్వహణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పచెప్పాము. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. కానీ కొంత మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చెబుతున్నారు.

కనుక కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగుల సేవలను వినియోగించుకునేందుకు అనుమతివ్వండి అని లేఖలో కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటాం’ అని కేంద్రానికి రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఎస్ఈసీ రమేష్ కుమార్ ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు