Seediri Appalaraju: మాకు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ.. ఈ పార్టీతో సమానం: మంత్రి సీదిరి అప్పలరాజు

ఓ పార్టీతో బీఆర్ఎస్ సమానమని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తెలంగాణ సర్కారుపై, కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Seediri Appalaraju

Seediri Appalaraju: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హరీశ్ రావు ఏపీ గురించి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ.. కేఏ పాల్ (KA Paul) పార్టీ (ప్రజాశాంతి)తో సమానమని ఎద్దేవా చేశారు.

“హరీశ్ కూడా మామ కేసీఆర్ తో కలిసి ఫాంహౌస్ లో కల్లు తాగుతున్నట్లున్నారు. మీ రాష్ట్రంలో జీతాలు సమయానికి రావడంలేదని అడిగితే డబ్బుల్లేవు అన్నారు. నీకు చేతనైతే ఆంధ్రాకి వచ్చి చూడు. ఆంధ్రలో మానవ వనరులు, విద్య, వైద్యాన్ని ఎలా మారుస్తున్నామో మీ మామ చెపుతారు. నాడు-నేడు పై మీ మామనే స్వయంగా టీంను మా దగ్గరికి పంపించారు. మా సాప్ట్ వేర్ నే మీరు వాడుతున్నారు.

ఆరోగ్య శ్రీని మీరు మరిచిపోతే.. మేం కొవిడ్ సైతం ఆరోగ్య శ్రీలో చికిత్స అందించాం. కొవిడ్ లో మీ బంగారు తెలంగాణ పరిస్థితి చూశాం.. ఏం వెలగబెట్టారో అందరికీ తెలుసు. కేవలం ఆంధ్రుల కష్టంతో అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని వదిలి వచ్చాం. ప్రతి రంగాన్ని గాడిలో పెట్టి దేశంలోనే అనేక అంశాల్లో తెలంగాణను మించి ఉన్నాం. డేటా తీసుకుని చెక్ చేసుకోండి. మీ కవితలా చాటింగ్ లు లేవు మా దగ్గర.

సుకేశ్ తో సీక్రెట్ చాట్ లు లేవు. లిక్కర్ స్కాంలు మా దగ్గర లేవు. చేతనైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నించాలి హరీశ్. అంతేగానీ సిగ్గులేకుండా బిడ్ వేస్తామంటారా? బంగారు తెలంగాణాలో దొరలపాలనే జరుగుతోంది. మీ ఫ్యామీలకే పదవులు.. తెలంగాణ మీ జాగీరా? మీ రాష్ట్రంలో స్కూల్స్, రోడ్ల సంగతి మాకు తెలుసు. ఎన్నికల కోసం రకరకాల గిమ్ముకులు వేస్తారు కేసీఆర్. మీ రాష్ట్రం వారు సాధారణ ప్రజలు అనేక మంది మా దగ్గరికి వచ్చి కరోనా చికిత్స తీసుకున్నారు.

వరంగల్ లో ఎంజీఎంలో ఎలుకలు కొరుకుతున్నాయి. ముందు వాటి సంగతి చూడు. జాతీయవాదం లేకుండా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చితే జాతీయపార్టీ అవుద్దా? దశాబ్దకాలంగా తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు మీరు. మీ పార్టీ పబ్లిసిటీ కోసం కల్లు తాగి రాజకీయాలు చేస్తున్నారు. ఏదో ఒకటి వాగాలని అనుకుంటున్నారు. ఆంధ్రా వాళ్లను ఏలా తిట్టారో మాకు తెలీదా? కేసీఆర్.. నైజాం దొర అని ప్రజలకు అర్థమైంది” అని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.

Botsa Satyanarayana: మా రాష్ట్రం గురించి మాకు తెలుసు.. మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. ఇలాగేనా మాట్లాడేది?: బొత్స