Car Accident: మితిమీరిన వేగం.. వృద్ధుడిపైకి దూసుకెళ్లిన కారు

మితిమీరిన వేగం ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగిన ఘటనతో విషాదచాయలు అలముకున్నాయి.

Accident

Road Accident: మితిమీరిన వేగం ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగిన ఘటనతో విషాదచాయలు అలముకున్నాయి. గ్రామంలో డేవిడ్ అనే వ్యక్తి టూ వీలర్‌పై వెళుతుండగా ఫాస్ట్ గా వచ్చిన కారు ఢీకొట్టింది. అంతేవేగంతో రోడ్ పక్కనే కూర్చొని ఉన్న వృద్ధుడిపైకి దూసుకెళ్లింది.

తీవ్రగాయాలతో పడి ఉన్న వృద్ధుడ్ని, మరో ఇద్దరు క్షతగాత్రులను దగ్గర్లోని నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే అంజి అనే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ ఎంపీగా తెలుగమ్మాయి..!