Nandyala Constable Murder Case : నంద్యాల కానిస్టేబుల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..ప్రాణ భయంతో పరుగులు తీసినా వెంటాడి చంపిన దుండగులు

నంద్యాలలో సురేంద్ర కానిస్టేబుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సురేంద్రను వాళ్లు చేసిన టార్చర్‌ షాక్‌కు గురిచేస్తోంది. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు.. అతనిది సుఫారీ హత్యగా అనుమానిస్తున్నారు. చివరి క్షణాల్లో.. రౌడీషీటర్ల నుంచి తప్పించుకునేందుకు.. కానిస్టేబుల్ సురేంద్ర ఎంతో ప్రయత్నించారు. అతని హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

Nandyala Constable Murder Case : అతనో పోలీస్‌ అన్నది మర్చిపోయారు.. మాటువేసి దారుణంగా వెంటాడారు.. తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారు.. దుర్మార్గులబారి నుంచి తప్పించుకునేందుకు .. అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రాణ భయంతో పరుగులు పెట్టినా .. వదిలేయాలంటూ వేడుకున్నా .. అసలు కనికరించలేదు. కత్తులతో పొడిచి..పొడిచి..కర్కశంగా క్షణాల్లో నిండు ప్రాణాన్ని తీశారు. నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సురేంద్రను వాళ్లు చేసిన టార్చర్‌ షాక్‌కు గురిచేస్తోంది.

కానిస్టేబుల్ Surendra’s murder case sumotoతీసుకున్న పోలీసులు.. అతనిది సుఫారీ హత్యగా అనుమానిస్తున్నారు. చివరి క్షణాల్లో.. రౌడీషీటర్ల నుంచి తప్పించుకునేందుకు.. కానిస్టేబుల్ సురేంద్ర ఎంతో ప్రయత్నించారు. అతని హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీషీటర్ల దాడితో.. కానిస్టేబుల్ సురేంద్ర.. ప్రాణభయంతో పరిగెడుతున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఓ రౌడీషీటర్, అతని అనుచరులే.. సురేంద్రను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Nandyala Constable Surendra Murder : హత్యకు ముందు.. ప్రాణభయంతో కానిస్టేబుల్ సురేంద్ర పరుగులు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

ముందుగా.. బీర్ సీసాతో సురేంద్ర తలపై దాడి చేశారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు సురేంద్ర పరిగెత్తారు. అయినప్పటికీ.. ఆ దుండగులు అతన్ని వెంబడించారు. ఆటోలో తీసుకెళ్లి చెరువు కట్ట దగ్గర కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత.. అటుగా బైక్‌పై వెళుతున్న వ్యక్తిని కత్తులతో బెదిరించి.. అతని బైక్ తీసుకొని.. దుండగులు పరారయ్యారు.

అయితే … మృతుడు సురేంద్ర గత కొన్నాళ్లుగా నంద్యాల డీఎస్పీ అఫీసులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అఫీసులో మంచి ఉద్యోగిగా అందరి ప్రశంసలు పొందాడు. అలాంటి వ్యక్తిని దుండగులు హత్య చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రౌడీషీటర్ల కదలికలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇబ్బందులు గురిచేస్తున్నాడనే కారణంతో హత్య చేశారా..? లేక మరేమైన ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video : రాంగ్ రూట్ లోవచ్చిన కారు-అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అరకిలోమీటరు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

ఇదిలావుంటే, నంద్యాల జిల్లాగా ఏర్పాడిన తర్వాత ప్రశాంతంగా ఉన్న పట్టణం.. కానిస్టేబుల్ సురేంద్ర హత్యతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏకంగా కానిస్టేబుల్ ను కత్తులతో పొడిచి చంపారని.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు