అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

sessions court granted conditional bail to Bhuma Akhila Priya : బోయిన పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరైంది.  సికింద్రాబాద్  సెషన్స్ కోర్టు  ఆమెకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.  శనివారం, జనవరి 23న  అఖిల ప్రియ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.  కాగా సికింద్రాబాద్ కోర్టులో ఆమె భర్త భార్గవరామ్ కు చుక్కెదురైంది.  భార్గవరామ్ వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది.  కాగా..కిడ్నాప్ కేసులో గత 17 రోజులుగా అఖిల ప్రియ చంచల్ గూడ జైలులో రిమాండ్ లో  ఉన్నారు.