Vijaysai Reddy: చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం ఇదే: విజయసాయిరెడ్డి
సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర శనివారం నెల్లూరు జిల్లాలో స్వాగత పాయింట్స్ నుంచి కావలి..
- T Venkateshwarlu
- Updated on- April 5, 2024 / 11:19 AM IST
Vijayasai Reddy
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ నెల్లూరు రూరల్లో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ బద్దేపూడి రవీంద్ర ఇవాళ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేయిస్తూ ఏపీలో పింఛన్ దారులకు ఇబ్బందులు కలిగిచడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదమని అన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
పార్టీలో చేరిన అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర శనివారం నెల్లూరు జిల్లాలో స్వాగత పాయింట్స్ నుంచి కావలి సిద్ధం సభ వరకు సాగుతుందని అన్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ముగుస్తుందని వివరించారు.
ఎన్నికల వేళ జగన్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. శనివారం జరగనున్న సభకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జగన్ పర్యటన ముందు నెల్లూరులో పలువురు నేతలు ఆ పార్టీలో చేరడం గమనార్హం.
Also Read: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదలకు సర్వం సిద్ధం
