Lok Sabha elections 2024: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదలకు సర్వం సిద్ధం

ఇవాళ హైదరాబాద్‌తో పాటు జైపూర్‌లో కాంగ్రెస్ సభలు నిర్వహించనుంది. ఇందులో...

Lok Sabha elections 2024: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదలకు సర్వం సిద్ధం

Lok Sabha elections 2024

Updated On : April 5, 2024 / 12:25 PM IST

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. పాంచ్‌ న్యాయ్‌పై హామీ ఇస్తూ మ్యానిఫెస్టోను రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను కాసేపట్లో ఢిల్లీలో విడుదల చేస్తారు.

దేశంలోని మహిళలు, రైతులతో పాటు యువత, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మ్యానిఫెస్టో రూపొందించారు. ఉపాధి హక్కుపై నిరుద్యోగులకు హామీ ఇవ్వనున్నారు. దేశంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని తీసుకువచ్చే హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ హైదరాబాద్‌తో పాటు జైపూర్‌లో కాంగ్రెస్ సభలు నిర్వహించనుంది. మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలను ఇందులో వివరించనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకుని మ్యానిఫెస్టో రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కోసం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని కమిటీ కొన్ని నెలలుగా సూచనలు సేకరించింది.

భారత్ జోడో న్యాయ్ యాత్ర వేళ ప్రకటించిన ఐదు న్యాయాల పేరుతో 25 హామీలను ప్రకటించనుంది కాంగ్రెస్. ఇప్పటికే యువ న్యాయ్, నారి న్యాయ్ తో పాటు కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్‌ కింద ప్రజలకు చేసే పనులను వివరించింది కాంగ్రెస్.

Chandrababu Naidu : చంద్రబాబుకు ఈసీ నోటీసులు.. ఎందుకంటే