Chandrababu Naidu : చంద్రబాబుకు ఈసీ నోటీసులు.. ఎందుకంటే

48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు.

Chandrababu Naidu : చంద్రబాబుకు ఈసీ నోటీసులు.. ఎందుకంటే

Chandrababu Naidu

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. గత నెల 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. సీఎం జగన్ పై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పులతో సహా ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు సీఈవో ముకేశ్ కుమార్ మీనా. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు.

అటు.. వైసీపీ నేతలపైనా టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబే పెన్షన్లు ఆపారంటూ మంత్రి జోగి రమేశ్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అలాగే వాలంటీర్ల సేవల నిలిపివేతకూ చంద్రబాబే కారణం అని వైసీపీ నేతలు చేసిన ట్వీట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో జోగి రమేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది.

Also Read : సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిది? గన్నవరంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోరు