Nellore Rotten Chicken : నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ సమీపంలోని మాంసపు దుకాణాల్లో కుళ్లిన కోడి మాంసం విక్రయాలు బయటపడ్డాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యవహారం బయటపడింది. అధికారుల తనిఖీల్లో భారీ స్థాయిలో కుళ్లిపోయిన చికెన్ పట్టుబడింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
చెన్నై నుంచి కోడి మాంసంతో పాటు కోడి లివర్ తరలిస్తున్న వాహనంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా చెన్నై నుంచి దిగుమతి చేస్తున్న 300 కిలోల కోడి లివర్ మాంసాన్ని సీజ్ చేశారు. ఆ మాంసం, లివర్ కుళ్లిపోయి ఉంది. ఆరిఫ్ అనే వ్యాపారి ఈ కుళ్లిన చికెన్ ను చెన్నైలో కొనుగోలు చేశాడు. ఆరిఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన కుళ్లిన చికెన్ విక్రయాల వ్యవహారం చికెన్ ప్రియులను షాక్ కి గురి చేస్తోంది. ఇన్నాళ్లూ తాము తిన్నది ఆరోగ్యకరమైనదో కాదోనని ఆందోళన చెందుతున్నారు. కాసుల కక్కుర్తితో కొందరు మాంసం విక్రయదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కుళ్లిన, చెడిపోయిన చికెన్ కొనుగోలు చేసి.. గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
నాన్ వెజ్ విషయంలో చాలా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అయితే డబ్బు కోసం కొందరు వ్యాపారులు దిగజారిపోతున్నారు. ప్రమాణాలు పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇలాంటి కుళ్లిన చికెన్ తింటే అనారోగ్యం ఖాయం అని, జబ్బుల బారిన పడతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలకే ప్రమాదం ఉందంటున్నారు. డబ్బు ఆశతో ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.