Krishnamraj Jayanti: దేశంలో ఎక్కడా అందుబాటులోలేని వైద్యం మొగల్తూరులో ఉచితంగా అందిస్తాం

ఈనెల 20వ తేదీన కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరు శ్రీ అందే బాపన్న కళాశాలలో మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేస్తున్నామని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి చెప్పారు.

Shyamaladevi

Shyamaladevi : సినీ నటుడు, మాజీ మంత్రి దివంగత కృష్ణంరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి మాట్లాడుతూ.. 20వ తేదీన కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఇతర దేశాల నుంచి వైద్యులను రప్పించి అరుదైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కృష్ణంరాజుకు ఈ ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని, ఆయన లేకుండా మొగల్తూరు రావడం ఎంతో బాధగా ఉందని అన్నారు.

Also Read :  మాగుంట విషయంపై బాలినేనికి తేల్చి చెప్పిన సీఎం జగన్.. వైసీపీలో ఇంకా తేలని ఒంగోలు సీటు పంచాయితీ

కృష్ణంరాజు పేదలకు విద్యవైద్యం అందించాలని చెప్పేవారని శ్యామలాదేవి తెలిపారు. ఈనెల 20వ తేదీన కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరు శ్రీ అందే బాపన్న కళాశాలలో మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా అందుబాటులో లేని వైద్యం మొగల్తూరులో ఉచితంగా అందించాలని నిర్ణయించామని అన్నారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తరువాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని శ్యామల దేవి అన్నారు.