మాగుంట విషయంపై బాలినేనికి తేల్చి చెప్పిన సీఎం జగన్.. వైసీపీలో ఇంకా తేలని ఒంగోలు సీటు పంచాయితీ

ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈసారి ఒంగోలు నియోజకవర్గం నుంచా? గిద్దలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతుంది.

మాగుంట విషయంపై బాలినేనికి తేల్చి చెప్పిన సీఎం జగన్.. వైసీపీలో ఇంకా తేలని ఒంగోలు సీటు పంచాయితీ

CM Jagan and Balineni srinivasareddy

Updated On : January 18, 2024 / 1:19 PM IST

Balineni srinivasa Reddy : వైసీపీలో ఒంగోలు సీటు పంచాయితీ ఇంకా తేలలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం సీఎం జగన్ ను కలిశారు. మాగుంటకు పార్లమెంట్ టికెట్ పై జగన్ ససేమీరా అన్నట్లు తెలిసింది. గిద్దలూరు, ఒంగోలులో ఎక్కడో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరో రెండురోజుల్లో ఒంగోలు సీటుపై సందిగ్ధతకు తెరపడే అవకాశం ఉంది.

ఒంగోలు జిల్లాలో వైసీపీ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంటల శ్రీనివాసులురెడ్డికి అవకాశం ఇవ్వాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధిష్టానం వద్ద పట్టుబడుతున్నాడు. మాగుంట, ఆయన కుమారుడు ఎవరో ఒకరికి పార్లమెంట్ స్థానం కేటాయించాలని బాలినేని పట్టుబడుతున్నప్పటికీ.. వైసీపీ అధిష్టానం ససేమీరా అంటుంది. ఇప్పటికే బాలినేనికి ఈ విషయంపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని బాలినేని కలిశారు. ఒంగోలు పార్లమెంట్ సీటుపై వీరిమధ్య చర్చకు రాగా.. మాగుంట విషయం మర్చిపో అంటూ బాలినేనికి  జగన్ సూచించినట్లు సమాచారం. మాగుంట స్థానంలో కొత్త వ్యక్తికి పార్లమెంట్ సీటు ఇస్తామని  జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : గుడివాడలో పోటాపోటీ.. నాని ఇలాకాలో చంద్రబాబు భారీ బహిరంగ సభ.. కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు

ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈసారి ఒంగోలు నియోజకవర్గం నుంచా? గిద్దలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతుంది. ఈ క్రమంలో ఒంగోలు, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఏదోఒక స్థానం నుంచి పోటీ చేయమని బాలినేనికి సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒంగోలులో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది.. అది క్లియర్ చేసే వరకు నేను ఇక్కడి నుంచి పోటీ చేయలేననే విషయాన్ని బాలినేని సీఎం జగన్ కు తెలిపినట్లు సమాచారం. దాదాపు రూ. 170 కోట్లు వరకు ఇళ్ల స్థలాలకు సంబంధించి భూసేకరణకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ నిధులన్నీ విడుదల చేయాలని మరోసారి సీఎం జగన్ ను బాలినేని కోరినట్లు తెలిసింది. జగన్ స్పందిస్తూ.. రెండు రోజుల్లోనే విషయంపై క్లారిటీ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.

Also Read : సీఎం వచ్చి సాక్ష్యం చెప్పాలి.. జైల్లోనే కోడికత్తి శ్రీను దీక్ష.. మద్దతుగా కుటుంబ సభ్యుల ఆమరణ దీక్ష

బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గిద్దలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తోంది. ఆ నియోజకవర్గం ప్రస్తుతం ఖాళీ ఉంది. అన్నా రాంబాబు పోటీ చేయనని తప్పుకోవటంతో ఆ స్థానంలో బాలినేనిని బరిలోకి దింపాలని జగన్ భావించినట్లు తెలిసింది. బాలినేని మాత్రం ఒంగోలు నుంచి పోటీచేస్తానని పట్టుబడుతున్నాడు.. అయితే, ఇళ్ల స్థలాల సమస్యకూడా ఉన్న నేపథ్యంలో బాలినేని ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే అంశంపై స్పష్టత రాలేదు. మరోసారి సీఎంతో భేటీ అయితే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.