Kodi Kathi Seenu : సీఎం వచ్చి సాక్ష్యం చెప్పాలి.. జైల్లోనే కోడికత్తి శ్రీను దీక్ష.. మద్దతుగా కుటుంబ సభ్యుల ఆమరణ దీక్ష

ఐదు సంవత్సరాలుగా నా కొడుకు జైల్లో ఉన్నాడని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Kodi Kathi Seenu : సీఎం వచ్చి సాక్ష్యం చెప్పాలి.. జైల్లోనే కోడికత్తి శ్రీను దీక్ష.. మద్దతుగా కుటుంబ సభ్యుల ఆమరణ దీక్ష

Kodi Kathi Seenu

Updated On : January 18, 2024 / 11:09 AM IST

Kodi Kathi Seenu Family Initiation : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి కేసులో నిందితుడిగాఉన్న జనపల్లి శ్రీనివాస్ విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నాడు. తనకు న్యాయం చేయాలని, సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని, లేకుంటే ఎన్వోసీ ఇచ్చి కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు గురువారం నుంచి విశాఖ సెంట్రల్ జైలులో శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు.

Also Read : Nandamuri Balakrishna : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

కనకదుర్గ టెంపుల్ కు వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత సావిత్రమ్మ, సబ్బరాజు ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. తన కొడుకు జనపల్లి శ్రీనివాస్ ను జైలు నుంచి విడుదల చేయాలని సావితమ్మ కన్నీటి పర్యాంతమవుతుంది. ఐదు సంవత్సరాలుగా నా కొడుకు జైల్లో ఉన్నాడని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, అలాకాకుంటే ఎన్ ఓసీ ఇచ్చి కేసు ఉపసంహరించుకోవాలని ఆమె డిమాడ్ చేసింది.