Cm Chandrababu: మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిన తీరును మంత్రులకు వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు.
నవంబర్ లో జరిగే పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోలేదని వెల్లడించారు. గత ప్రభుత్వంలో అక్కడికి వెళ్ళి సింగపూర్ మంత్రులను సైతం వైసీపీ బెదిరించిందని చంద్రబాబు చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి అప్పుడు తెచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెప్పారు. బార్ పాలసీ ని కేబినెట్ ఆమోదించింది. కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాప్ లలో బినామీలు వస్తే సహించను అని తేల్చి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంచి సూచన అని కితాబిస్తూ వెంటనే ఆటో డ్రైవర్లు ను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం..