Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్.. సిట్ విచారణకు విజయసాయిరెడ్డి, ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..!

దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని, అవసరమైనప్పుడు వాటన్నింటిని బయటపెడతాను, అవసరమైనప్పుడు వాటి గురించి అధికారులకు చెబుతాను అని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల..

Vijayasai Reddy

Vijayasai Reddy: సిట్ విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. విజయవాడ కమిషనరేట్ లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈరోజు ఉదయమే ఆయన హాజరుకావాల్సి ఉంది.

అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం రావాలంటూ సమాచారం ఇవ్వడంతో విజయసాయిరెడ్డి విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి సాక్షిగా మాత్రమే విజయసాయిరెడ్డిని పిలిచామని సిట్ అధికారులు చెబుతున్నారు. నోటీసుల్లోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నారు. గతంలో ఆయన కాకినాడ పోర్టుకు సంబంధించి సీఐడీ విచారణకు హాజరైనప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Also Read : జగన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. రూ.27.5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

అంతేకాదు.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని, అవసరమైనప్పుడు వాటన్నింటిని బయటపెడతాను, అవసరమైనప్పుడు వాటి గురించి అధికారులకు చెబుతాను అని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసుని సిట్ చాలా సీరియస్ గా దర్యాఫ్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరింత ముందుకు వెళ్లేందుకు సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. దాంతో ఆయన విచారణకు హాజరయ్యారు.

Also Read : డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ సారి ఈ మార్పులు కూడా..

ఆయన దగ్గరున్న ఆధారాలు ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు. నిన్న కూడా 6 గంటల పాటు విచారించారు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here