Smart Policing Survey : స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021..తెలుగు రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ స్థానాలు

దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021 విడుదల చేసింది.

First and Second Positions for Telugu States : దేశ వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021 విడుదల చేసింది. స్మార్ట్ పోలీసింగ్ పై నివేదిక ఇచ్చింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించింది.

పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ స్థానం లభించాయి. స్మార్ట్ పోలీసింగ్ అన్ని అంశాల్లో ఏపీకి తొలిస్థానం, తెలంగాణకు రెండోస్థానం వచ్చాయి. పోలీసు సెన్సిటివిటీ, సత్ ప్రవర్తనలో తెలంగాణ పోలీసుకు మొదటి స్థానం దక్కింది. ఫ్రెండ్లీ పోలీసింగ్, సాంకేతికతలో ఏపీకి తొలిస్థానం లభించింది.

FCI Explanation : తెలంగాణలో బియ్యం కొనుగోళ్లపై ఎఫ్ సీఐ వివరణ

సాంకేతిక వాడకంలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చింది. అవినీతి రహిత సేవల్లో కేరళ పోలీసింగ్ కు మొదటిస్థానం, ఏపీకి రెండో స్థానం, మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. జవాబుదారీతనం, ప్రజల్లో విశ్వాసం విభాగంలో ఏపీకి తొలిస్థానం, తెలంగాణకు రెండోస్థానం లభించాయి.

ట్రెండింగ్ వార్తలు