Vande Bharat Express : వందే భారత్ ట్రైన్‌ చెలరేగిన మంటలు.. టికెట్ తీసుకోకుండా టాయిలెట్‌లో నక్కి సిగరెట్ కాల్చిన వ్యక్తి

వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది.

Vande Bharat Express

Vande Bharat Express : వందే భారత్ రైలులో ఓ వ్యక్తి సిగరెట్ కాల్చడంతో రైలులో మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది గూడూరు, మనుబోలు మధ్య రైలు నిలిపివేశారు. తిరుపతి (Tirupati) నుంచి సికింద్రాబాద్‌కు (Secunderabad) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Vande Bharat Express : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక .. స్పందించిన IRCTC

వందే భారత్ ఎక్స్ ప్రెస్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలు గూడూరు దాటింది. గమ్యం చేరడానికి ఇంకా ఎనిమిది గంటల సమయం ఉందనగా రైలు మూడో బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కంపార్ట్‌మెంట్‌లోని ఎమర్జెన్సీ ఫోన్‌ను ఉపయోగించి రైలు గార్డును అప్రమత్తం చేశారు. రైలు మనుబోలు స్టేషన్ దగ్గర నిలిపివేసారు.

Vande Bharat New Colour : రంగు మారనున్న వందే భారత్ రైళ్లు .. ఆ రంగులేంటో తెలుసా..?

రైల్వే సిబ్బంది మంటలను ఆర్పే యంత్రంతో రంగంలోకి దిగి పొగలు వస్తున్న టాయిలెట్ కిటికీ అద్దాన్ని పగుల గొట్టారు. లోపల ఓ ప్రయాణికుడు ఉన్నట్లు గుర్తించారు. అతను అక్కడ సిగరెట్ తాగి పడేయడంతో ప్లాస్టిక్ షీట్ అంటుకుని మండినట్లు తెలుస్తోంది. మంటలు ఎక్కువ కావడంతో బయటకు పొగలు వ్యాపించాయి. రైల్వే సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. నెల్లూరులో పొగతాగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆలస్యంగా రైలు బయలుదేరింది.