Karnataka boy suicide
Jaggaiahpet: మూడు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కొద్ది రోజుల్లో ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మంగళగిరి మండలం నవులూరుకి చెందిన శ్వేత (22)గా గుర్తించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు చెరువు వద్ద ఈ ఘటన జరిగింది.
సోమవారం హైదరాబాద్‌లోని Optam కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. శనివారం సాయంత్రం మంగళగిరిలో ఐదు గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన శ్వేత ఇంటికి తిరిగి రాలేదు. కూతురు కోసం ఎదురుచూస్తున్న ఆమె తల్లికి రాత్రి 8 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పంపింది శ్వేత.
వెంటనే పోలీసులకు సమాచారం అందించామని పేరెంట్స్ తెలిపారు. ఆన్లైన్ ట్రాన్సక్షన్‌తో యువతి మోసపోయినట్లు చిల్లకల్లు ఎస్ఐ చినబాబు అనుమానిస్తున్నారు. యువతి సెల్ ఫోన్ ఆమె తండ్రి వద్దనే ఉన్నదని, ఇంకా వివరాలు సేకరిస్తున్నామని ఎస్ఐ చినబాబు వెల్లడించారు.
Read Also జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చిన్నారి సహా నలుగురు మృతి