Some women play poker in Vijayanagar : ఏపీ ప్రభుత్వం పేకాట ఆడుతున్న వారిపై కొరడా ఝులిపిస్తుంది. అందులో భాగంగా జరిగిన రైడ్స్ లో మహిళలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు విజయనగరంలో కొంతమంది మహిళలు. ఎంచక్కా పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు.
పక్కా సమాచారంతో విజయనగరం ఉమెన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ నేతృత్వంలో రైడ్ చేసిన పోలీసులు.. రమ్మీ ఆడుతున్న తొమ్మిది మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 వేల 300 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని.. మహిళలపై కేసు నమోదు చేశారు. కేసును వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.